
మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు.

డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఇలాగా కింద కూర్చొని తినడం వలన పొట్ట చుట్టూ కొవ్వు మొత్తం పోతోంది. ఆలాగే, ఉండే కండరాల్లో వచ్చే నొప్పులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

కింద కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇలా తినేటప్పుడు మన శరీర కదలికలు జరుగుతాయి. దీని వలన రక్త సరఫరా కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే మనకీ కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు నేలమీద కూర్చొని తింటే.. ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.