
జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

మధుమేహం: మధుమేహం ఉన్న వారు కూడావీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది

కిడ్నీలో రాళ్లు: జామ కాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం కిడ్నీలో రాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి, వారంలో ఒకసారి మాత్రమే తినండి.

అలెర్జీ : జామ కాయ తిన్న వెంటనే కొందరికి చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని మితంగా తీసుకోండి. ఉప్పు, కారం వేసే ముందు ఒకసారి అలోచించి తినండి.

జీర్ణ సమస్యలు : జీర్ణ సమస్యలతో బాధ పడేవారు జామకాయను తింటే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి, వీటిని ఉదయం పూట తినకండి.