
మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగుతారు. అయితే, ఇలా తాగొచ్చా లేదో అని కొంచం కూడా ఆలోచించరు. దీని వలన నష్టాలు తప్ప లాభాలు లేవని నిపుణులు కూడా చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాలు, మాంసాన్ని కలిపి తీసుకోవడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే గుండెల్లో మంట కూడా వస్తుంది.

ఎందుకంటే పాలు, మాంసంలో ప్రోటీన్స్, పోషకాలు ఇలా రెండూ ఉంటాయి. ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం కూడా ఇలా తీసుకుంటే మంచిది కాదని చెబుతుంది.

ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం పాలు, మాంసం కలిపి తీసుకోవడాన్ని తప్పుగా చెబుతుంది. ఎందుకంటే, ఇక్కడ ఆహారాలకు శక్తి వేరుగా ఉంటుంది. పిత్త, కఫ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది.

అంతేకాదు, దీని వలన అనేక సమస్యలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే చర్మ అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆహారాలు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి, వీటిని తీసుకోకపోవడమే మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)