కట్ల పాము కథ తెలుసా? అబ్బో వింటే భయమే..

Samatha

2 August 2026

పాము అంటే భయం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం వెళ్లిపోతారు.

అయితే భూమిపై అనేక రకాల పాములు ఉంటాయి. ముఖ్యంగా అందులో కోబ్రా, కింగ్ కోబ్రా అంటే చాలా మందికి భయం ఉంటుంది.

కానీ వాటన్నింటి కంటే, కట్లపాము చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. దీని కథ తెలిస్తే వణుకు పుట్టాల్సిందేనంట.

కట్ల పామును చాలా వరకు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకు అంటే? ఇది కుడితే అంతగా నొప్పి అనిపించదు. కేవలం దోమ కుట్టినట్లే అనిపిస్తుంది.

కానీ దీని విషయం మాత్రం చాలా ప్రమాదకరమైనదంట. చాలా వేగంగా నాడీ వ్యవస్థను ప్రభావిం చేస్తుంది. చాలా డేంజరస్ అని చెబుతున్నారు నిపుణులు.

ఈ పాము ఎక్కువగా రాత్రి సమయంలోనే సంచారం చేస్తూ ఉంటుందంట. అందుకే చాలా మంది రాత్రి కట్ల పాము కాటు వేసి, మరణించారు అనే ఘటనలు చాలా చూశాం.

అంతే కాకుండా ఈ పాము కాటు వేయడం వలన, ఆ ప్రదేశంలో నొప్పి కూడా అంత ఎక్కువగా ఉండదంట. సాధారణ నొప్పి, కాటు వేసిన చోట వాపు మాత్రం కనిపిస్తుంది.

కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అది చాలా ప్రభావం చూపిస్తుందంట. కళ్లు మూసుకపోవడం,నరాల బలహీనత, నోటిలో లాలాజలం కారడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంట.