
మినపప్పు పాయాసానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు , ఒక కప్పు సేమ్యా ఒక కప్పు బెల్లం, రెండు కప్పుల పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు , 10 కిస్మిస్ , ఇంకా మూడు గ్లాసుల నీళ్లు కూడా తీసుకోవాలి. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

తయారీ విధానం : ముందుగా మినపప్పును తీసుకుని బాగా వేయించి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తరువాత వీటిని కడిగి కుక్కర్‌లో మెత్త మెత్తగా ఉడికించాలి. ఇంకా ఒక పాత్రలో బెల్లం వేసి దానిని పాకంలా కరిగించాలి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తరవాత వీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి ఇలా చేస్తే మలినాలు మొత్తం తొలగిపోతాయి.

ఉడికిన మినపప్పులో బెల్లం పాకం పోసి మిక్స్ అయ్యే వరకు కలపాలి. కొద్దీ సేపటి సేమ్యా కూడా వేయి ఆ తరవాత పాలు కూడా పోసి మీడియం మంటపై ఉంచి చిక్కబడే వరకు బాగా మరిగించాలి. వేరే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించి పాయసంలో కలపాలి. చివర్లో కొద్దిగా యాలకుల పొడి చల్లి స్టవ్ చేసి కిందకు దించేయాలి.

వేడివేడిగా తింటే తియ్య తియ్యగా ఉంటుంది ఇంకా శరీరానికి మంచి బలాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా అలసట, ఒంటి నొప్పులు ఉన్నవారికి సూపర్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇంకా మినపప్పులో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి కండరాలకు బలాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

సేమ్యా మినపప్పు పాయసం వలన ఎన్నో లాభాలు : ఇది తింటే శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఇంకా ఇది తియ్యగా, కమ్మగా ఉంటుంది. మినపప్పుతో టిఫిన్స్ మాత్రమే కాకుండా ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనిల బెల్లం, పాలు కూడా వేసి ఇంట్లోనే చాలా ఈజీగా చేసి తినొచ్చు. నడుము నొప్పి, ఒంటి నొప్పులు ఉన్నవారు ఈ పాయసాన్ని తింటే చాలు