
తక్కువ బడ్జెట్‌లో సెకెండ్ హ్యాండ్‌లో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.. కేవలం రూ. 2.55 లక్షలకే మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను మీ ఇంటికి తెచ్చుకోండి. సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్‌లో స్విఫ్ట్ కారు రూ. 3 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మరి ఇంతకీ ఆ కారు ఏ రిజిస్ట్రేషన్‌పై నమోదు చేయబడింది.? ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో ఇప్పుడు చూద్దాం..!

ఈ కారు నెంబర్ మహారాష్ట్ర నెంబర్ ప్లేట్‌పై రిజిస్టర్ చేయబడింది. అలాగే ఇప్పటివరకు 45 వేల కిలోమీటర్లు తిరిగింది. ఇక ఈ సెకండ్ హ్యాండ్ కారును ఆటోమేటిక్‌తో కాకుండా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పొందుతారు.

ఈ కారు VXi 1.2 ABS BS IV మోడల్‌తో విక్రయానికి అందుబాటులో ఉంది. అలాగే దీని ఫ్యూయల్ టైప్ పెట్రోల్ కాగా, ఈ కారు లీటర్ పెట్రోల్‌కు మైలేజ్ 12 కిలోమీటర్లు ఇస్తుంది.

ఈ మారుతి సుజుకి కారును 2010లో రిజిస్టర్ చేశారు. సెకండ్ ఓనర్ దీనిని ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచారు. అలాగే ఈ కారు ముంబై లొకేషన్‌లో అందుబాటులో ఉంది.అంతేకాకుండా ఇది రూ. 2,55, 525 లక్షలకు పొందుతారు.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే, మీరు సెకండ్‌హ్యాండ్‌లో కారు తీసుకుంటున్నట్లయితే.. సదరు వాహనానికి సంబంధించిన పత్రాలను ధృవీకరించకుండా, వాహన యజమానిని కలవకుండా ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయవద్దు.