
త్వరలో భారత్‌లోనే 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో చాలా కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది.

వివో టీ1 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ప్రస్తుతం భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,990గా ఉండగా హైఎండ్ స్పెసిఫికేషన్ రూ. 19,990గా ఉంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌లో 18 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేసే, 5000 ఎమ్‌ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. కేవలం గంటన్నరలో వంద శాతం చార్జింగ్ పూర్తవుతుంది.