Ingenuity Helicopter: అంగారకుడిపై అద్భుత హెలికాప్టర్‌.. ‘ఇన్‌జెన్యూటీ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?

|

Apr 11, 2021 | 12:34 PM

Ingenuity Helicopter: అంగారకుడిపై ప్రయోగాలు చేపట్టే క్రమంలో అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'.. పర్సవరెన్స్‌ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇన్‌జెన్యూటీ పేరుతో ఓ హెలికాప్టర్‌ను అంగారకుడిపైకి పంపించింది..

1 / 7
అంగారక గ్రహంపై మానవ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' అంగారకుడి రహస్యాలను తెలుసుకునేందుకు 'పర్సవరెన్స్‌' అనే ప్రయోగం చేపట్టింది.

2 / 7
ఈ ప్రయోగంలో భాగంగానే అంతరిక్ష చరిత్రలో తొలిసారి మరో గ్రహంపైకి హెలికాప్టర్‌ను పంపించారు. ఇన్‌జెన్యూటీ పేరున్న ఈ హెలికాప్టర్‌ అంగారకుడి రహస్యాలను చేధించనుంది.

3 / 7
1.8 కిలోల బరువుండే ఈ మినీ హెలికాప్టర్‌ రూపకల్పనలో అధునాతన మెటీరియల్స్‌ను ఉపయోగించారు.

4 / 7
 హెలికాప్టర్‌కు అమర్చిన రెండు రోటార్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్‌ ఫైబర్‌ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. ఈ రోటార్లు నిమిషానికి 2,400 చుట్లు తిరుగుతాయి.

5 / 7
ఇక అంగారక గ్రహంపై పరిశోధనుల చేపట్టడానికి మూడు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్, ఇతర పరికరాలు అమర్చారు. ఒక్కో ప్రయాణంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది.

6 / 7
Ingenuity Helicopter: అంగారకుడిపై అద్భుత హెలికాప్టర్‌.. ‘ఇన్‌జెన్యూటీ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?

7 / 7
అమెరికాలోని అలబామాలో ఉండే 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ హెలికాప్టర్‌కు ఈ పేరు పెట్టింది. 'ఇన్‌జెన్యూటీ' అంటే చాతుర్యం, బుద్ధి కుశలత అని అర్థం.