
నీటి లభ్యతను తెలుసుకోవడంతోపాటు దానిపై జీవం ఉనికిని కనుగొనడం కోసం నాసా ఈ ప్రయోగం చేపట్టింది. 2011 ఆగస్టు 5న అంతరిక్ష యాత్ర మొదలుపెట్టిన జునో దాదాపు 280 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురు గ్రహ కక్ష్యలోకి చేరింది.

స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్న జునోక్యామ్ విజిబుల్ లైట్ ఇమేజర్ ఈ ఫొటోలను తీసింది. ఉపగ్రహం ఓ భాగాన్ని పూర్తిగా ఫొటోలలో బంధించింది. కెమెరా రెడ్, బ్లూ ఫిల్టర్ వెర్షన్ వివరాలు రాగానే.. ఈ ఫొటో కలర్ ఇమేజ్ను నిపుణులు తయారు చేస్తారు. గనిమీడ్కు సంబంధించి త్వరలో మరిన్ని ఫొటోలను జునో పంపించనుంది.

బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్కు చెందిన స్పష్టమైన చిత్రాలను నాసా స్పేస్‌క్రాఫ్ట్ పంపించింది. ఉపగ్రహ ఉపరితలం స్పష్టంగా కనిపించేలా ఈ ఫొటోలు ఉన్నాయి. త్వరలో మరిన్ని చిత్రాలను స్పేస్‌క్రాఫ్ట్ పంపించనుంది.

నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్.. బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్ చిత్రాన్ని బంధించింది. గనిమీడ్కు అత్యంత దగ్గరకు వెళ్లిన జునో.. రెండు ఫొటోలను భూమి మీదకు పంపించింది. ఈ ఫొటోలు అత్యంత స్పష్టతతో ఉండటం విశేషం.

గనిమీడ్ ఉపరితలాన్ని ఈ ఫొటోల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఉపగ్రహంపై ఉన్న బిలాలు, నల్లటి ఉపరితలాలు ఇందులో కనిపిస్తున్నాయి.

ఈ జనరేషన్లో గనిమీడ్కు అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఇదే. అయితే ఈ ఫొటోల ద్వారా శాస్త్రీయంగా ఎలాంటి నిర్ణయానికి రావడం లేదు. కానీ, ఈ అద్భుతమైన ఫొటోలను అలా చూస్తూ ఉండిపోవచ్చు.