యావత్ దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి దశ కరోనా వ్యాప్తి సమయంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సెకండ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ప్రధానంగా అటాక్ చేసేది ఊరితిత్తులపైనే. దాంతో మనిషి ఆక్సీజన్ లెవల్స్ పడిపోయి.. క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు.
కరోనా వైరస్ సోకిన వారు నిరంతరం.. ఆక్సీమీటర్‌తో తమ పల్స్‌ను నిరంతరం చెక్ చేసుకుంటుండాలి. అత్యవసరం అయితే వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే జనాలు ఎక్కువగా ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ చెకింగ్ మిషన్లను విరివిగా కొనోగులు చేస్తున్నారు. అయితే, వీటి ధర అధికం అవడంతో అందరికీ అందుబాటులో ఉండవు.
ప్రజల స్థితిగతులు, కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్త్ స్టార్టప్ ఎంఫైన్ సంస్థ.. బ్లడ్ ఆక్సిజన్ సాచ్యూరేషన్ మీటర్ స్మార్ట్ ఫోన్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎంఫైన్ తయారు చేసిన ‘ఎంఫైన్ పల్స్’ టూల్ ద్వారా ప్రజలు తమ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యూరేషన్ను స్మార్ట్ ఫోన్‌తో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యింది. ఐఓఎస్ డివైజ్‌లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఎంఫైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ యాప్‌లోని ‘ఎంపల్స్’ టూల్‌పై క్లిక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ కెమెరా, ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. ఆ తరువాత కెమెరా, ఫ్లాష్లైట్పైన మీ చేతి వేలిని పెట్టాలి. అప్పుడు స్క్రీన్ రెడ్ కలర్లోకి మారుతుంది.
మీ బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే రెడ్, బ్లూ లైట్‌ను ఏఐ ఆల్గారిథమ్ గుర్తించి.. మీ ఆక్సిజన్ సాచ్యూరేషన్ లెవెల్స్‌ను లెక్కిస్తుంది. కేవలం 20 సెకన్లలోనే ఫలితాలను మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.