
ఎస్ జానకి (జానకమ్మ ) కేవలం ఒక పేరు, ఒక మనిషి మాత్రమే కాదు. అంతకి మించిన గానకోకిల అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆమె పాడిన ప్రతి పాట కోట్లాది మంది మెప్పును పొందాయి. ధనుష్ హీరోగా నటించిన సినిమాలో అమ్మా అమ్మా అనే అనే పాట అందరి మనుసులను కదిలించాయి. ఆ పాటను అంత గొప్పగా పాడింది. అయితే, ఇప్పుడు ఆ గాత్రం మూగపోయింది. అనారోగ్య సమస్యల కారణంగా ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు.

అయితే, ఈ క్రమంలోనే ఆమె గురించి తెలుసుకోవడనికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఆమె అంత గొప్పగా పాడటానికి ఆమె తీసుకున్న హెల్తీ డైట్ కూడా. జానకమ్మ నేరుగా ఎక్కడా చెప్పలేదు కానీ, ఆమె అనుచరులు పలు ఇంటర్వ్యూల్లో ఆమెకి ఎలాంటి ఫుడ్ ఇష్టమో? ఏయే ఏయే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారో వెల్లడించారు అవేంటో ఇక్కడ చూద్దాం..

ఉదయం టిఫిన్స్ లో ఇది ఉండాల్సిందే.. జానకమ్మ ఎక్కువగా ఇంటి ఫుడ్ తినేవాళ్లు అట. అయితే, టిఫిన్స్ లో ఇడ్లీ తినేవాళ్లు. వర్క్ చేసేటప్పుడు మరి, హెవీగా కాకుండా లైట్ ఫుడ్స్ తినే వాళ్ళు. ఎప్పటి నుంచో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తప్పక ఉండేదని చెప్పారు. తన జీవితంలో ఎక్కువగా సాత్వికమైన ఆహారాలను మాత్రమే తీసుకునేది.

గానకోకిల ఎస్ జానకమ్మ సాంబార్ అన్నం, పులిహోర చాలా ఇష్టంగా తినేవాళ్లు. ఇంకా చెప్పాలంటే తినే ఆహారాల్లో మసాలాలు తక్కువ ఉన్నవే తీసుకునేవాళ్లు. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్లు. ఇంటి నుంచి తెచ్చిన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళని ఆమె అనుచరులు చెబుతున్నారు. అందుకే అన్ని పాటలు పాడగలిగారెమో.

ఇంకా జానకమ్మ భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే అట. ఏది మిస్ చేసిన పెరుగు అన్నాన్ని అసలు మానేయకుండా తింటుంది అట అంత ఇష్టమని చెబుతున్నారు. ఇంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని జానకమ్మ వల్ల మరోసారి రుజువైంది.