32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల

Edited By:

Updated on: May 13, 2026 | 9:10 AM

అడవుల జిల్లా ఆదిలాబాద్.. రాష్ట్ర రాజధాని హైదరబాద్ నుండి విసిరేసినట్టుగా మహారాష్ట్ర సరిహద్దున ఉండే అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిన జిల్లా. ఈ జిల్లాలోని గ్రామాలు , గూడాల అభివృద్ది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. సమీప మండల కేంద్రం నుండి గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికి కొన్ని ఊర్లకు దారే లేదు.

1 / 5

2 / 5
దారున్నా రాకపోకలు సాగించేందుకు ప్రైవేట్ వాహనాలు‌ తప్ప ఆర్టీసీ బస్ రానే రాదు. మా ఊరికి ఒక్క సారైనా ఆర్టీసీ బస్ రాకుండా పోతుందా.. ఆ బస్ లో ప్రయాణం చేయకుండా పోతామా అని ఓ మండలంలోని ఆ మూడు గ్రామాలు మూడు దశాబ్దాలుగా కలలు కన్నాయి. ఆర్టీసీ బస్ కోసం పోరాటాలు సైతం చేశాయి. 32 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. మూడు దశాబ్దాల తర్వాత తమ ఊర్లకు ఆర్టీసీ బస్ రావడంతో ఆ మూడు గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు.

3 / 5
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గిరిగామ్, లీమ్గూడ, అట్నాంగూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయమై అధ్వానంగా మారడంతో 1994 నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రోజు నుండి తమ గ్రామ రహదారిని బాగు చేయాలని అదికారులకు మొర పెట్టుకుంటూ వస్తున్నారు.

4 / 5
ఎట్టకేలకు గతేడాది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2 కోట్ల నిధులతో కుచులాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గిరిగామ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల సర్పంచి ఉత్తం, మార్కెట్ డైరె క్టర్ ధనుంజయ్ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారులకు సమస్యను వివరించారు. ఆర్టీసీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి సుంకిడి, కుచులాపూర్ ఎక్స్ రోడ్డు మీదుగా గిరిగామ్, లీమ్గూడ, అట్నాం గూడ గ్రామాలకు బస్సు సేవలను ప్రారంభించారు.

5 / 5
32 ఏళ్ల తర్వాత తమ గ్రామాలకు బస్సు రావడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బస్సుకు పూజ చేసి, కండక్టర్, డ్రైవర్ ను పూల మాలలు, సాలువాలతో సన్మానించారు. 1964 కు ముందటి ఆర్టీసీ బస్ అనుభవాలను ఈనాటి తరంతో పంచుకున్నారు ఆ మూడు గ్రామాల వృద్దులు.

Follow Us