
చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు. పేగులను కూడా క్లీన్ చేస్తుంది. దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

బీరకాయ, శెనగనగపప్పు కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు బీరకాయలు, అర కప్పు సెనగపప్పు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, రెండు టమాటా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక కప్పు నూనె , అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండు మిరపకాయ, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

బీరకాయ, శెనగనగపప్పు కూర తయారీ విధానం : ముందుగా సెనగపప్పును బాగా కడిగి 10 నుంచి 15 నిమిషాల పాటు దీనిని బాగా నానబెట్టాలి. ఈ బీరకాయ తొక్కను తీసి దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి , అది బాగా వేడయ్యాక పోపు గింజలు వేయాలి

బీరకాయ, శెనగనగపప్పు కూర తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక దీనిలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నాలుగు ఎండు మిరపకాయ, ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసి ఇది పోపు తాలింపు పెట్టాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వీటిని వేయించాలి.

బీరకాయ, శెనగనగపప్పు కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో మీరు నాలుగు టమాటాలు కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇంకా దీనిలో మీరు నానబెట్టిన సెనగపప్పు కూడా వేసి 3 నిమిషాలు అలాగే ఉంచాలి. బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిముషాల పాటు ఉడికించాలి.