
రెడ్ లైట్ థెరపీ అనేక వ్యాధులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ రెడ్ లైట్ థెరపీ గాయాలను నయం చేయడానికి మాత్రమే కాకుండా మనిషి బాధ పడుతున్న ఈ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

చర్మం, జుట్టు సమస్యలకు ఇది చెక్ పెడుతుంది : ఇది జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది ఇంకా రేడియేషన్ వలన కలిగే చర్మ సమస్యలను అలాగే చర్మ వాపును కూడా ఇది తగ్గిస్తుంది. వీటిపై పరిక్షలు చేసినప్పుడు వీటిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది

నొప్పి నివారణ : ఈ రెడ్ లైట్ థెరపీ నరాల నొప్పిని కంట్రోల్ చేస్తుంది అలాగే పాదాల దగ్గర పుండ్లను కూడా ఇది నయం చేస్తుంది. ఇది ఎంతో సహాయకరంగా కూడా పని చేస్తుందని కూడా నిపుణులు చేసిన పరిక్షల్లో నిరూపించారు. కాబట్టి, ముందు ముందు మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మానసిక ఆరోగ్యం, నాడీ వ్యవస్థ : ఇది డిప్రెషన్ సమస్యకు కూడా చెక్ పెడుతుంది ఇంకా వయసుతో పాటు కంటిచూపు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఇంకా ఇది బలహీనంగా ఉన్న వారిని బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఈ సమస్యలలో సానుకూల ఫలితాలను చూపించింది. ఈ థెరపీ పార్కిన్సన్స్ వ్యాధిలో డోపమైన్‌ను ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను కూడా రక్షిస్తాయి.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)