
ఆర్‌సీబీ జట్టుకు నిరంతరం వికెట్లు తీస్తూ విజయాన్నందిస్తున్న హీరో హర్షల్ పటేల్. డెత్ ఓవర్లలో విజయవంతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు రాబడుతున్నాడు. దీంతో హర్షల్ సరికొత్త రికార్డును సృష్టించాడు. లాసిత్ మలింగ, కగిసో రబాడా వంటి మేటి బౌలర్లను వెనుకకు నెట్టి ముందు వరుసలో నిలిచాడు.

ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ప్రతి మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వికెట్లు తీశాడు. అతని ఖాతాలో 17 వికెట్లు ఉన్నాయి. మొదటి 6 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ సందర్భంగా హర్షల్.. లసిత్ మలింగను ఓడించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ అయిన మలింగ 6 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

మలింగ మాత్రమే కాదు.. కగిసో రబాడా వంటి ఉత్తమ ఫాస్ట్ బౌలర్ కూడా ఇందులో వెనుకబడి ఉన్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 50 వికెట్లు తీసిన రబాడా కూడా 16 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 5

అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ కూడా వెనకబడే ఉన్నాడు. అతను కూడా హర్షల్ ఫీట్‌ని సాధించలేకపోయాడు. ఫాల్క్‌నర్ పేరు మీద 16 వికెట్లు ఉన్నాయి.