భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా చేసి తింటే తగ్గుతాయ్

Updated on: Oct 07, 2026 | 8:54 AM

ఇంట్లోనే చాలా ఈజీగా గుల్లగా, కరకరలాడే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఉదయం పాలతో పాటు తినడానికి ఇంకా సాయంత్రం టీ టైమ్‌కు అద్భుతమైన స్నాక్‌గా ఈ ఆరోగ్యకరమైన బిస్కెట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ బిస్కెట్ల తయారీకి కావలసినవి, వాటిని కడాయిలో ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
ఇంట్లోనే చాలా ఈజీగా గుల్లగా, కరకరలాడే రాగి బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. ఉదయం పాలతో పాటు తినడానికి ఇంకా  సాయంత్రం టీ టైమ్‌కు అద్భుతమైన స్నాక్‌గా ఈ ఆరోగ్యకరమైన బిస్కెట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ బిస్కెట్ల తయారీకి కావలసినవి, వాటిని కడాయిలో ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: రాగిపిండి: అర కప్పు, ఓట్స్  : అర కప్పు, యాలకుల పొడి: పావు స్పూన్,  బేకింగ్ పౌడర్: అర టీ స్పూన్,  పటిక బెల్లం పొడి: పావు కప్పు, నెయ్యి: మూడు టేబుల్ స్పూన్లు , పాలు: మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద  కడాయిని పెట్టుకోవాలి. బేకింగ్ చేసేటప్పుడు స్టీల్ పాన్ కంటే అల్యూమినియం కడాయిని వాడటం మంచిది. కడాయిలో ఒక స్టాండ్ పెట్టి మూత మూసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఐదు నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కేలోగా, ఒక ప్లేట్‌లో అర కప్పు రాగిపిండి, అర కప్పు ఓట్స్ పావు స్పూన్ యాలకుల పొడి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు కప్పు పటిక బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తీపి ఎక్కువగా కావాలనుకుంటే పటిక బెల్లాన్ని పెంచుకోవచ్చు. పంచదార ఇంకా  బెల్లం పొడి కూడా వాడుకోవచ్చు.

3 / 5
ఈ మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్ల మంచి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే వెన్న కానీ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. పిండికి నెయ్యి బాగా పట్టేలా చేత్తో కలపాలి. పిండిని చేతిలోకి తీసుకుని ముద్ద చేసినప్పుడు అది చక్కగా బైండ్ అయితే నెయ్యి సరిపోయినట్లే. నెయ్యి సరిపోకపోతే బిస్కెట్లు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే మరో స్పూన్ నెయ్యి కలిపి చూసుకోవచ్చు.

4 / 5
ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపాలి. ఇది చపాతీ పిండిలా మెత్తగా కాకుండా, కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. బిస్కెట్ ఒత్తినప్పుడు విడిపోకుండా, షేప్ వచ్చేలా బైండ్ అయితే సరిపోతుంది.
 పిండి ముద్దనుండి కొద్దికొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఏదైనా పాలిథిన్ పేపర్ లేదా కవర్ మీద పెట్టి, బిస్కెట్ లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు మీడియంలాగా  ఉండేలా చూసుకోవాలి. మందంగా ఉంటే కడాయిలో సరిగా బేక్ కావు.

ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపాలి. ఇది చపాతీ పిండిలా మెత్తగా కాకుండా, కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. బిస్కెట్ ఒత్తినప్పుడు విడిపోకుండా, షేప్ వచ్చేలా బైండ్ అయితే సరిపోతుంది. పిండి ముద్దనుండి కొద్దికొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఏదైనా పాలిథిన్ పేపర్ లేదా కవర్ మీద పెట్టి, బిస్కెట్ లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు మీడియంలాగా ఉండేలా చూసుకోవాలి. మందంగా ఉంటే కడాయిలో సరిగా బేక్ కావు.

5 / 5
ఒత్తిన బిస్కెట్లను ఒక ప్లేట్‌లో పక్కపక్కనే సర్దుకోవాలి. ముందుగా వేడెక్కించిన పాన్  మూత తీసి, ఈ ప్లేట్‌ను జాగ్రత్తగా కడాయిలో పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 15 నిమిషాల పాటు బేక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత, ప్లేట్ మీద పట్టిన ఆవిరి నీటిని పక్కన పెట్టి, బిస్కెట్లను జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పుకోవాలి. కడాయి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్త వహించాలి. తిరిగి మూత పెట్టి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మరో 15 నిమిషాలు బేక్ చేయాలి. మొత్తంగా అరగంట పాటు బేక్ అయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మూతను పక్కకి తీసి, బిస్కెట్లను కడాయిలోనే పూర్తిగా చల్లారనివ్వాలి. కడాయిలో ఉండే వేడికి ఏమైనా పచ్చిగా ఉన్నా అవి కూడా చక్కగా వేగిపోతాయి. బిస్కెట్లు పూర్తిగా చల్లారిన తర్వాతే క్రిస్పీగా, కరకరలాడుతూ ఉంటాయి. చల్లారిన తర్వాత వీటిని గాలి తగలని డబ్బాలో నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us