Boondi Kura: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 5 నిమిషాల్లో కమ్మని బూందీ కూర.. అదిరిపోయే టేస్టీ కర్రీ

Updated on: Oct 03, 2026 | 5:36 PM

హడావుడిగా ఆఫీసులకు వెళ్లే ఉదయాలు లేదా రాత్రి వేళల్లో త్వరగా వంట ముగించాలనుకున్నప్పుడు.. ఫ్రిడ్జ్‌లో కూరగాయలు ఏమీ లేకపోతే ఏం వండాలో తోచక చాలామంది కంగారుపడుతుంటారు. అలాంటి అత్యవసర సమయాల్లో ఇంట్లో ఉండే ఖారా బూందీతో లేదా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్న బూందీతో క్షణాల్లో చేసుకునే అద్భుతమైన గ్రేవీ వంటకం 'బూందీ కూర'. 

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు ఖారా బూందీ, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ¾ కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు,  అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, ఒకటిన్నర కప్పుల నీళ్లు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

2 / 5
తయారీ విధానం: స్టవ్ వెలిగించి ఒక గిన్నె లేదా కడాయి పెట్టి.. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. అనంతరం ఒక కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసి.. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.

3 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత ముప్పావు కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేయాలి. వెంటనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి మరియు పావు టీస్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.

4 / 5
ఇప్పుడు మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు టమాటాలు మెత్తగా పేస్ట్‌లా మగ్గేంత వరకు ఉడికించాలి. టమాటాలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నూనె పైకి తేలే వరకు ఎసరును బాగా మరిగించాలి. నూనె పైకి తేలి గ్రేవీ మరుగుతున్నప్పుడు ఒక కప్పు బూందీని వేసి కలపాలి.

5 / 5
మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే ఉడికించాలి ఎక్కువ సేపు ఉడికిస్తే బూందీ పేస్ట్‌లా కరిగిపోతుంది. చివరగా స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని కలుపుకోవాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'బూందీ కూర' సిద్ధం! అన్నంలో కలుపుకుని తిన్నా లేదా చపాతీల్లోకి నంజుకున్నా అద్భుతమైన రుచితో కడుపునిండా తృప్తినిస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us