పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రిసిపీ.. ఈ రైస్ పెడితే కొండంత బలం

Updated on: Sep 18, 2026 | 2:30 PM

పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెట్టడానికి త్వరగా, రుచికరంగా ఏదైనా తయారుచేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ సులభమైన టమాటో రైస్ రెసిపీ మీకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఇది తయారుచేయడానికి తక్కువ సమయం పడుతుంది, అలాగే పిల్లలు కూడా దీనిని ఎంతో ఇష్టపడతారు.

1 / 5
పిల్లల మంచి ఆహారం అందించాలని , వారికి బలమైన, మంచి పోషకాలు ఉన్న ఆహారం అందించాలని తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకోసం, ప్రతి రోజు కొత్త కొత్త ఆహారాలను రెడీ చేయడం కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, వారు ఇష్టంగా ఫుడ్ తినాలి అంటే తప్పకుండా వారి డైట్‌లో ఈ టమాటా రైస్ ఉండాల్సిందేనంట. దానిని సులభంగా ఎలా చేయాలి అంటే?

2 / 5
టమాటా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. టమాటాలు, నెయ్యి, నూనె, పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళ దుంపలు, లవంగాలు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం, పుదీనా, గరం మసాలా.

3 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత రిసిపీ రెడీ చేయడం కోసం, ఒక ప్రెషర్ కుక్కర్‌ తీసుకొని, అందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

4 / 5
 ఆ తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరిగిన బంగాళ దుంప ముక్కలు, టమాట ముక్కలు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి, టమాట ముక్కలు మెత్తగా అయ్యేవరకు సుమారు 5 నిమిషాలు మగ్గించాలి.

5 / 5
ఇప్పుడు, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒక నిమిషం పాటు కలపాలి. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత, మూత తీసి నెమ్మదిగా కలిపితే, కమ్మని టమాటో రైస్ సిద్ధంగా ఉంటుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కే కాకుండా, ఇంట్లో అల్పాహారానికి కూడా బెస్ట్

Loading...
Unable to load recommendations.
Follow Us