
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. అంతేకాదు.. గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి విత్తనాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ కె, ఈ) ఖనిజాలు (మెగ్నీషియం, జింక్ వంటివి)తో నిండి ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి గుమ్మడి గింజలు బెస్ట్ ఎంపిక అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఒక టేబుల్‌స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తడిని దూరం చేసి ప్రశాంతతను కలిగిస్తుంది.

గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గొంతులో చికాకు, దగ్గుతోపాటు తలనొప్పికీ కారణం అవుతాయి. ఇంకొందరిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిస్తే.. గుమ్మడి విత్తనాలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.