గుమ్మడి అత్యధిక పోషక విలువలు కలిగిన కూరగాయలలో ఒకటి. దీని రసం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ రసంలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా తరచుగా వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.
గుమ్మడి రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది.
కడుపు మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో గుమ్మడికాయ రసం బలేగా సహాయపడుతుంది. దీని రసం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మన చర్మం అందంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ముడతలు, మచ్చలను కూడా నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
గుమ్మడిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరిచే గుణం ఉంది.
గుమ్మడి రసం తయారు చేయడానికి.. ముందుగా గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్‌లో వేయాలి. అర గ్లాసు నీరు వేసి బాగా కలపాలి. అవసరమైతే ఇందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీన్ని ఉదయం పూట పరగడుపున తాగితే శరీరం శుభ్రపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ప్రయత్నించవచ్చు.