గుడ్డు లేని ఆమ్లెట్ 5 నిమిషాల్లో రెడీ.. దూాదిలా మెత్తగా.. శరీరానికి ఫిట్‎గా..

Updated on: Mar 17, 2026 | 12:45 PM

గుడ్డు లేని ఆమ్లెట్ ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి దీనిని మనం రోజూ వాడే వాటితోనే ఈజీగా చేసేయొచ్చు. దీనిని కొంత మంది వెజ్ ఆమ్లెట్ అంటారు. మసాలాలతో చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతోంది.

1 / 5
కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, రెండు గ్లాస్ ల నీళ్ళు, రెండు పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసి, తగినన్ని నీళ్లు పోసి జోరుగా అది కలిసే పోయే వరకు కలుపుతూనే ఉండండి.

3 / 5
ముందుగా రెడీ చెసి పెట్టుకున్న పిండిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరను  వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి.

4 / 5
ఇక ఇప్పుడు  పెనం వేడి చేసి దానిలో కొద్దిగా నూనె వేయండి. ముందుగా సిద్ధం చెసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెనంపై పోసి మీడియం మంటపై దానిని రెండు వైపులా బాగా  కాల్చాలి.

5 / 5
ఆమ్లెట్ మరింత మెత్తగా, దూదిగా రావాలంటే రావడానికి, ఒక చిటికెడు బేకింగ్ సోడాను కలుపుకుంటే సరిపోతోంది.లేదా పిండిలో  బియ్యప్పిండి లేదా సూజీ రవ్వ కలిపితే ఆమ్లెట్ క్రిస్పీగా వస్తుంది. 

Follow Us