
మనం ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ముఖ్యమైన సాక్ష్యం ‘ప్రామిసరీ నోట్’. దీన్నే మన భాషలో ‘నోటు ’ అని అంటారూ. ఈ పేపర్ మీద ఒక సంతకం పెడితే చాలు పని అయిపోయిందని అనుకుంటారు. కానీ, చట్టపరంగా మీరు రాపించుకున్న నోటుకు విలువ ఉండాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ప్రామిసరీ నోట్ పేపర్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని రాయాలి. అలాగే రాసేటప్పుడు అప్పు ఇచ్చే వ్యక్తి పేరు, తీసుకునే వ్యక్తి పేరు కరెక్ట్ గా ఉండాలి. ఆ తరవాత వారి ఇంటి అడ్రెస్లు కూడా సొంతవి రాయాలి. ఎంత అప్పుగా తీసుకుంటున్నారు, దానికి వాళ్ళు నెలవారీ వడ్డీ ఎంత చెల్లిస్తారనే విషయాలు ముందుగానే చెప్పాలి

ఇది అస్సలు మర్చిపోకండి? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వడ్డీ కాలమ్ లో కూడా వివరాలు ముందుగానే రాయాలి. దీనిని ఖాళీగా ఉంచితే, కోర్టులో ఆ వడ్డీని క్లెయిమ్ చేసే అవకాశం అసలు ఉండదు. అప్పుడు అసలు మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. కాబట్టి, రాసేటప్పుడు ప్రతీ కాలమ్‌ని నింపడం చాలా ముఖ్యమని గ్రహించండి.

ఈ ప్రామిసరీ నోట్ పై ‘రెవెన్యూ స్టాంపులు’ అంటించడం చాలా ముఖ్యం. ఈ స్టాంపు అతికించి మొత్తం కలిసేలా సంతకం చేయడం చాలా ముఖ్యం. ఇంకా స్టాంపులు లేని ప్రామిసరీ నోట్ అసలు చెల్లదు . అంటే వివరంగా చెప్పాలంటే చట్టం దృష్టిలో ఒక ‘చిత్తు కాగితం’ అని అర్థం. కాబట్టి, దీనిని బాగా గుర్తుపెట్టుకోండి.

కచ్చితంగా ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. ఏదైనా జరిగి అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే, మీరు కోర్టుకి వెళ్ళి రికవరీ చేసుకోవచ్చు. తప్పుడు ఫిర్యాదుల వల్ల ఎఫ్ఐఆర్ నమోదైతే, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి మీ డబ్బును కాపాడుకోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు