
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం, జుట్టు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే చుండ్రు, జుట్టు చిట్లడం, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.

జుట్టు సంరక్షణకు ఖరీదైన రసాయనాలతో కూడిన ఉత్పత్తులను పూయడానికి బదులుగా ఇంటి నివారణలను ప్రయత్నించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జుట్టు బాగా, అందంగా పెరగడానికి సహాయపడుతుంది.

జుట్టుకు మేలు చేసే పదార్ధాల్లో ఉసిరి ముందు వరుసలో ఉంటుంది. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఉసిరి జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల జుట్టుకు ఉసిరితో తయారు చేసిన హెయిర్ మాస్క్‌లు వినియోగించవచ్చు.

ఉసిరిని జుట్టుకు పూయడం కంటే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి జ్యూస్ చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.