
తయారీ విధానం: ఒక కప్పు పెసలు అది కూడా 6 గంటల ముందు నానబెట్టాలి, ఒక కప్పు బియ్యం, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర, రొయ్యలు, ఉప్మా రవ్వను తీసుకోవాలి.

ఉప్మా తయారీ చేసుకోవాలి ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకుని దానిలో ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , అల్లం పేస్ట్ , నాలుగు కరివేపాకు ఆకులు , పోపు పెట్టి తక్కువ నీటితో ఉప్మాను చేసుకుని సిద్ధం చేసుకోవాలి.

రొయ్యల వేపుడు కూడా తయారు చేసుకోవాలి ఒక 100 గ్రాముల రొయ్యలు తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాను వేసుకోవాలి.

పెసరట్టు కాల్చడం మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత దోస పెనం గ్యాస్ మీద పెట్టి, దానిని బాగా వేడి చేసి దానిలో కొద్దిగా నూనె లేదా నెయ్యిని రాయాలి. ముందుగా పెసరట్టు పిండిని పెనంపై వేసి దోసలాగా పోసుకోవాలి.

దోసను కాల్చిన తర్వాత, దానిపై మూడు టేబుల్ స్పూన్ల ఉప్మా దాని మీద వండిన రొయ్యల కూర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా దాని మీద వేసుకోవాలి. దాని చుట్టూ నెయ్యి వేసి, దోసను రెండు వైపులా కాల్చిన తర్వాత దానిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.