
డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె షర్మిల.. డిసెంబర్17,1973న పులివెందులలో జన్మించిన షర్మిల పూర్తిపేరు వైఎస్ షర్మిలారెడ్డి

షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్. వీరికి ఒక అబ్బాయి. మరొక అమ్మాయి.

డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సెప్టెంబరు 2,2009 న హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన తరువాత మార్చి11, 2011 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయటంతో జూన్12, 2012 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల జగన్మోహన్ రెడ్డితరపున ప్రచార బాధ్యతలను తీసుకుని ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన షర్మిల

014 ఎన్నికల్లో వైసీపీ తరపున కీలక పాత్ర పోషించిన షర్మిల..జగనన్న వదిలిన బాణాన్ని అనే డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది 2019లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో బై బై బాబు పేరుతో సరికొత్త ప్రచారం. చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ పంచ్ డైలాగ్‌లతో బస్సు యాత్ర చేసిన షర్మిల

YS Sharmila

పాద యాత్రలో 190 గ్రామాలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్లొన్న షర్మిల.. మొత్తం 3,112 కి.మీ. పాద యాత్ర నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కువ దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళగా షర్మిల

ఫిబ్రవరి15, 2021 తెలంగాణలో పార్టీ పెట్టేందుకు షర్మిల సమాలోచనలు చేశారు. ఫిబ్రవరి 17, 21 విద్యార్థులతో షర్మిల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 25 పాలమూరు జిల్లా వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు.

మార్చి, 2021 తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహించారు.

ఏప్రిల్ 9, 2021న ఖమ్మంలో బహిరంగ సభ. సభకు హాజరైన వైఎస్ విజయమ్మ. భవిష్యత్ కార్యాచరణ పై ప్రకటన