Telangana: తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. నవంబర్‌లోగా అందరికీ ఉచిత అల్పాహారం

Updated on: Aug 27, 2026 | 7:56 PM

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని అక్టోబర్ చివరి నాటికి అన్ని విద్యాసంస్థలకు చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ పనుల్లో జాప్యం జరిగినా నవంబర్ 15లోపు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అల్పాహార పంపిణీ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

1 / 5
ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించడం, పాఠశాలల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి.

2 / 5
తొలి దశలో జూన్ నెలలో ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రీకృత వంటశాలల ద్వారా 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలకు అల్పాహారం సరఫరా ప్రారంభించారు. ఈ దశలో 1,44,610 మంది విద్యార్థులు లబ్ధి పొందారు.తర్వాత మధిర, మంథని ప్రాంతాల్లో కొత్త కేంద్రీకృత కిచెన్లు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం నార్సింగి, ఉప్పల్, సంగారెడ్డి, కొడంగల్, వరంగల్, మధిర, మహబూబ్‌నగర్, హనుమకొండ, మంథని ప్రాంతాల్లో కేంద్రీకృత వంటశాలలు పనిచేస్తున్నాయి. ఈ నెలాఖరులో మంచిర్యాలలో మరో కిచెన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

3 / 5
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే 39 ప్రాంతాల్లో కేంద్రీకృత వంటశాలలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న కిచెన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్త వంటశాలలను ఏర్పాటు చేయడానికి సుమారు రూ.299.90 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు లెక్కగట్టారు.

4 / 5
ఈ వ్యయంలో 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా, మిగిలిన 30 శాతం మొత్తాన్ని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లు భరించనున్నాయి.కొత్త వంటశాలల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌లు, షెడ్లను వినియోగించుకోవాలని నిర్ణయించారు. వాటిని కిచెన్లకు అవసరమైన సౌకర్యాలతో తీర్చిదిద్దడం వల్ల నిర్మాణ సమయం, వ్యయం రెండూ తగ్గే అవకాశం ఉందని తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు భావిస్తున్నారు.

5 / 5
అన్ని కేంద్రీకృత వంటశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉచిత అల్పాహారం అందనుంది. వంటశాలల నిర్మాణం పూర్తవుతూ, సరఫరా వ్యవస్థ సిద్ధమవుతున్న కొద్దీ మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో తెలంగాణలో విద్యార్థుల పోషకాహారం, పాఠశాల హాజరు పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us