Telangana: వారికి తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం.. CM KCR ప్రకటన

|

Jul 17, 2022 | 6:12 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్​ పర్యటించారు మొదట భద్రాచలంలో పర్యటించిన సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు.

1 / 5
 వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో వంతెన పైనుంచి గోదావరి ఉద్ధృతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం ఐటీడీఏలో ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

2 / 5
 వరద బాధితులకు పునరావాస కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

3 / 5
సింగరేణి, ప్రభుత్వం కలిపి రూ.వెయ్యికోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. గోదావరికి 90 అడుగుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

4 / 5
భారీ వర్షాల దృష్ట్యా నెలాఖరు వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూచించారు.

5 / 5
 వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి.. శాంతి పూజలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు.