
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత రాఖీలు కట్టారు.

రాఖీలు కట్టిన మహిళా నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు

ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పలువరు మహిళలు ఆయనకు రాఖీ కట్టారు.

ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు

సికింద్రాబాద్‌లో వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌కు రాఖలు కట్టారు సోదరీమణులు. ఆ తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మంత్రి.