
పంజాబ్ రాజధాని చండీగఢ్ లో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుమారుడి వివాహం ఇవాళ (ఆదివారం) చాలా సింపుల్‌గా జరిగింది.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నవజీత్ సింగ్‌కు, ఎంబీఏ చదువుతున్న సిమ్రన్ కౌర్‌తో పెండ్లి జరిగింది.

మొహాలీలోని గురుద్వారా సచ్చా ధన్ సాహిబ్‌లో పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్’ మేరకు వివాహాన్ని నిర్వహించారు.

వధువరుల వాహనాన్ని సీఎం చన్నీ స్వయంగా పెండ్లి వేదిక వరకు నడిపారు.

కొత్త దంపతులు, భార్య, బంధువులతో కలిసి నేలపై కూర్చొని పెండ్లి భోజనం తిన్నారు.

కాగా, నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంపై కినుక వహించిన అమరీందర్ సింగ్ గత నెలలో సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చమ్‌కౌర్ సాహిబ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, అమరీందర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీని అనూహ్యంగా సీఎం పదవికి ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్.