
సోమవారం ప్రధాని మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్‌లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు.

ఎంతో కాలంగా జవాన్లు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. సైనికులతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

జవాన్ల త్యాగం మరువలేదని అన్నారు. ఇంతకంటే గొప్ప దీపావళిని కోరుకోవడం లేదని తెలిపారు.

ఉగ్రవాద ముగింపే దీపావళి పండగని, దాన్ని కార్గిల్ సాధ్యం చేసిందన్నారు. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయన్నారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దేశ సరిహిద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్‌లతో కలిసి పండగ జరుపుకుంటున్నారు.

సైనికులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకోగా.. ఈసారి కార్గిల్‌లో ఆ వేడుకలు జరుపుకోనున్నారు.

2001 నవంబర్‌లో సైనిక స్కూల్‌లో పీఎం మోదీని కలిసిన మేజర్ అమిత్.. ఆనాటి జ్ఞాపకానికి సంబంధించిన ఫోటోను ఆయనకు బహుకరిస్తూ ఎమోషనల్ అయ్యారు.