జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వేలాది మంది జనసైనికులు పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కు దారిలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికాయి.
గజమాలతో పవన్ ను సత్కరించారు. తనకు ఘనస్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
పలువురు స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ కి వినతిపత్రాలు అందజేశారు.
మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, యువత, ఆడపడుచుల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అంకితమని పేర్కొన్నారు
బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్రలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేయనున్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల చొప్పున సాయం అందించనున్నారు.
కౌలు రైతు భరోసా యాత్రలో ఇప్పటికే జనసేనాని పలు జిల్లాల్లో పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు.