Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న మరో భారీ ఫ్లైఓవర్!

|

Jan 19, 2022 | 3:33 PM

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది.

1 / 7
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. విస్తరిస్తున్న మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు జీహెచ్ఎంసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తోంది.

2 / 7
ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో ప్రజల మౌలిక వసతులు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలరద్దీ క్రమబద్దీకరణ నేపథ్యంలో వ్యూహాత్మక పథకాల ద్వారా రోడ్ల వెడల్పు, జంక్షన్ ల అభివృద్ది, సుందరీకరణ పనులు చేపడుతున్నారు.

3 / 7
అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దక్షిణ ప్రాంతం నుండి సులువుగా తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపడుతున్నారు. మినీ రింగు రోడ్డుగా పిలువబడే ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు వెళ్లే మార్గంలో అండర్ పాసులు ఎస్సార్ డీపి మొదటి దశలో నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు.

4 / 7
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పథకం రెండో దశలో ఆరాంఘడ్ నుండి జూపార్క్ వరకు శంషాబాద్ నుంచి పాతబస్తీకి సులువుగా ప్రయాణించేందుకు ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన బహదూర్‌పురా జంక్షన్ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖి చేశారు.

5 / 7
దాదాపు రూ.636.80 కోట్ల వ్యయంతో ఆరాంగర్ నుండి జూపార్కు వరకు నిర్మాణంలో ఉన్న 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని సీ.ఎస్. సోమేశ్ కుమార్, జీహెచ్ఎసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. 4.5 కిలోమీటర్ల అతి పెద్ద ఫ్లయ్ ఓవర్ నిర్మాణం మార్చి 2023 వరకు పూర్తి చేయాలన్న లక్ష్యమంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

6 / 7
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బహద్దూర్ పుర, అరంఘర్ నుండి జూ పార్కు కారిడార్ ఫ్లై ఓవర్ ఫలక్ నుమ, ఆర్.ఓ.బి ఉప్పుగూడ ఆర్.యు.బి చేపట్టిన పనులు మార్చి 2023 వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు అధికారులు తెలిపారు.

7 / 7
4.5 కిలోమీటర్ల అతి పెద్ద ఫ్లయ్ ఓవర్ నిర్మాణం మార్చి 2023 వరకు పూర్తి చేయాలన్న లక్ష్యమంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.