
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఓపెన్ కాస్ట్ -2 గనిలో యాక్సిడెంట్

క్వారీలో మట్టి తీసుకొచ్చేందుకు వెళ్తున్న 100 టన్నుల డంపర్ యూటర్న్ తీసుకొంటుండగా ప్రమాదం.. ముగ్గురు కార్మికులు దుర్మరణం

అదే సమయంలో వర్షం కురుస్తుండగా, బొలెరో వాహనం గనిలోకి వెళ్తూ ఉంది.. ఈ సందర్భంలో డంపర్ డ్రైవర్‌కి బొలెరో కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు

బొలెరోపైకి డంపర్ దూసుకుపోవడంతో బొలేరోలో ఉన్న కార్మికులంతా అత్యంత ఘోరంగా రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న మృతుల బంధువులు.. శోక సంద్రంలో ఓపెన్ కాస్ట్ మైన్