
పీఎం-కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 22వ విడత పెట్టబడి సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి రెండో వారంలోనే ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలోనే రైతులు ఈ కేవైసీ వంటివి పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఈకేవైసీ ఉన్నవారికి మాత్రమే నిధులు జమ అవుతాయి.

అయితే ఈ పథకం కింద 2025 నవంబర్ 19న 21వ విడత నిధులు రూ.2000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో 22 విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు వేచి చూస్తున్నారు.

ముందుగా 22వ విడత ఫిబ్రవరి చివరి నాటికి విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హోలీ పండుగలోపు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, అయితే ఫిబ్రవరి ముగిసి, హోలీ పండుగ కూడా పూర్తయినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.

కొన్ని నివేదికల ప్రకారం.. మార్చి 13న అంటే వచ్చే వారం రోజుల్లో పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రోజున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటించనున్నారని.. ఆ సందర్భంగా రైతులకు 22 విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే మీరు పీఎం కిసాన్‌ను సంబంధించి కేవైసీ చేసుకోకపోయినా, లేదా ఆధార్ లింక్ లేకపోయినా, అధికారిక పోర్టల్‌లో మీ ID లింక్ చేయడం వంటికి అప్‌డేట్ చేసుకోకపోతే మీకు 22వ విడత నిధులు అందకపోవచ్చు. కాబట్టి వెంటనే మీ దగ్గర్లోని మీసేవా కేంద్రాలకు వెళ్లి వాటిని అప్‌డేట్ చేసుకోండి.