
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా భావిస్తారు. ఈ రోజును పవిత్రమైనదిగా భావించి నదీ స్నానం ఆచరించి ఇంకా ఉపవాసం ఉండటం వలన ఎంతో ఫలం వస్తుందని చెబుతున్నారు. అలాగే, తిథుల మార్పుల వల్ల ఒక రోజు వ్రతం ఇంకో రోజు పూజలు వస్తుంటాయి.

కన్య : ఈ రాశి వారికి అకస్మాత్తుగా డబ్బు రావడంతో వీరి జీవితం కూడా మారుతుంది. ఇంకా వీరి పనికి కూడా తగిన గుర్తింపు వస్తుంది. ఇంకా చేసే పనుల్లో ఆ విష్ణువు అనుగ్రహం ఉంటుంది. పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకా పిల్లల ఎదుగుదలను కూడా మీరు చూస్తారు. మీ సంతోషం డబుల్ అవుతుంది.

వృషభ రాశి: జ్యేష్ఠ పూర్ణిమ రోజునే జరిగే గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి సానుకూలంగా ఉండనుంది. కృష్ణుడు అనుగ్రహం వలన ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. వీళ్ళు శత్రువులను కూడా ఓడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు పక్కగా విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం కూడా మారుతుంది

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.