
సేమియా సగ్గు బియ్యం పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ పాయసం తింటారు. కాగా, ఇప్పుడు మనం సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా రుచికరంగా ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచి అదిరిపోతుందో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు : సేమియా ఒక కప్పు, సగ్గు బియ్యం, కప్పున్నర, కొబ్బరి పాలు, పాలు రెండు కప్పులు, బెల్లం కప్పున్నర, నెయ్యి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కిస్‌మిస్, ఎండు ద్రాక్ష, వీలైతే కుంకుమ పువ్వు రెండు రెబ్బలు.ం

తయారీ విధానంలోకి వెళితే..ముందుగా సేమియాను తీసుకొని, మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్‌మిస్, అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే కాకుండా కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని వాటిని మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. అలాగే సగ్గు బియ్యం కూడా నెయ్యి వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, కొబ్బరి పాలు, పాలు రెండూ పోసుకొని మంచిగా మరిగించుకోవాలి. తర్వాత అందులో సగ్గు బియ్యం, సేమియా వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఉడికితే రుచి అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత అందులో బెల్లం వేయాలి. బెల్లం వేసి, కొన్ని కొన్ని నీళ్లు పోసి అవి మంచిగా ఉడికించుకుంటూ ఉండాలి. పాయసం కాస్త చిక్కబడేలా చూసుకోవాలి.

తర్వాత అందులో కొబ్బరి ముక్కలు, కిస్‌మిస్, ఎండు ద్రాక్షఅన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా, అలాగే ఏ శుభకార్యాలకు అయినా సరే ఇలా పాయసం చేస్తే రుచి అదిరిపోతుంది. అంతే కాకుండా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.