
దోసెలు వేయాలి అంటే ముందుగా బియ్యం నానబెట్టి, పిండి పులియబెట్టి వేస్తారు. అయితే ఇక్కడే సరైన కొలతలు తీసుకొని పిండిని నానబెట్టుకున్నప్పుడు దోసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయంట. కాగా, ఇప్పుడు మనం దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : ముందుగా దోసె పిండికి కావాల్సిన పదార్థాలు, మూడు కప్పులు దోసె బియ్యం, రేషన్ బియ్యంతో చేసినా దోసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే ఒక కప్పుడ మినపప్పు, శనగ పప్పు రెండు టీ స్పూన్లు, మెంతులు వన్ టీ స్పూన్, పోహా గుప్పెడు. రుచికి సరిపడ ఉప్పు, నీరు.

తయారీ విధానంలోకి వెళితే..ముందుగా బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. దాదాపు 8 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒకటికి రెండు సార్లు తెల్లగా శుభ్రం చేసుకున్న తర్వాత బౌల్ నిండుగా నీళ్లు పోసి బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. అందులో మినపప్పు, శనగపప్పు, తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో పోహా నానబెట్టుకోవాలి. అలాగే మెంతులు కూడా నానబెట్టుకోవాలి.

ఇవన్నీ రాత్రి నానబెట్టుకొని, ఉదయం తీసుకోవాలి. వాటిని మరొకసారి శుభ్రపరుచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన దోసెలు చాలా అద్భుతంగా వస్తాయి.మినపపప్పు, పోహా, మెంతులు, శనగపప్పు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వీటన్నింటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసి నానబెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక రోజు వరకు పిండిని పులియబెట్టుకోవాలి. ఈరోజు మిక్సీ పట్టిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టకుండా పక్కన పెట్టుకోవాలి. మరసటి రోజు ఉదయం నుంచి దోసెలు వేసుకోవాలి. దోసెలు వేసుకోవడం కోసం ముందుగా, పాన్ పై నూనెలేదా నీళ్లు జల్లించి, దోసె వేసుకోవాలి. తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ దోసెలు రెడీ.