
Tea టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చాలా మంది టీ కప్పుతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అయితే టీని టేస్టీగా పెట్టాలి అంటే తప్పకుండా ఈ పదార్థాలు ఉండాల్సిందే, అవి టీ పొడి, పాలు, నీళ్లు, అల్లం, యాలకుల పొడి, పంచదార.

తయారీ విధానంలోకి వెళితే.. మొదటగా పచ్చి పాలు తీసుకొని వాటిని ఒక బౌల్‌లో పోయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాలు పోసిన కడాయి పెట్టి పాలను బాగా మరిగించుకోవాలి. కొన్ని నీళ్లు పోసి, పాలు పొంగు వచ్చి దాదాపు రెండు నిమిషాల పాటు మరిగేలా చూసుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్లీ వేరే పాన్ పెట్టి అందులో డికాషన్ తయారు చేయాలి. దీని కోసం ఒక కప్పు వాటర్ పోసి అందులో తగినంత పంచదార, టీ పొడి, యాలకుల పొడి, అల్లం వేసి బాగా మరిగించాలి. మీరు పోసిన కప్పు వాటర్ అరకప్పు వచ్చే వరకు ఆ నీరు మరుగుతూనే ఉండాలి.

అవి బాగా మరిగిన తర్వాత మీరు కాచి చల్లార బెట్టుకున్న పాలను ఆ మరిగే టీ డికాషన్‌లో పోయాలి. ఇది బాగా మరిగేలా చూసుకోవాలి. ముఖ్యంగా పాలు పోసిన తర్వాత దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు టీ మరగాలి. ఇలా మరగడం వలన రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా రుచి కూడా మారుతుంది. ఇలా మరిగిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని గ్లాస్‌లల్లో వడబోసి తాగెయ్యడమే. అంతే టేస్టీ టేస్టీ టీ రెడీ. ఇలా చేసి అత్తింటి వారికి ఇస్తే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు.

ఇక కొంత మంది టీ తయారు చేసే ముందు ముందుగానే పాలు పోసి మరగబెడతారు. కానీ అలా చేయకూడదు. దీని వలన టీ రుచి మారుతుంది. డికాషన్ ఫర్ఫెక్ట్‌గా తయారు అయిన తర్వాతనే టీ ప్రిపేర్ చేసుకోవాలి. పాలు వేడి చేయకుండా పచ్చిపాలతో డైరెక్ట్‌గా పైన చెప్పిన పద్ధతిలో టీ తయారు చేసుకున్నా రుచి అద్భుతంగా ఉంటుంది.