
హిమాలయ పర్వత ప్రాంతాలు, కాశ్మీర్ లోయలలో లభించే ప్రత్యేకమైన వెల్లుల్లి రకమే పహాడీ వెల్లుల్లి. దీనిని ఏక-రేకు వెల్లుల్లి, కొండ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఉపయోగించే వెల్లుల్లిలో అనేక రేకలు ఉంటే, పహాడీ వెల్లుల్లి ఒకే ఒక గడ్డ లేదా రెబ్బ రూపంలో ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న ఔషధ గుణాలు సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పహాడీ వెల్లుల్లి ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. దీనిలోని ఎల్లిసిన్ అనే ఆరోమాటిక్ కాంపౌండ్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, భోజనం తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల, గుండె ఆరోగ్యం: రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేసి, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు నివారణ: హై బీపీ సమస్య ఉన్నవారికి పహాడీ వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తనాళాలను సడలించి, రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహాయపడుతుంది. అంతేకాదు..దీనిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరంపై ఫ్రీ రాడికల్స్ దాడిని అడ్డుకుని, కణాల క్షీణతను తగ్గిస్తుంది.

పహాడీ వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి?: ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 నుండి 3 పహాడీ వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి, స్వచ్ఛమైన నీటితో పాటు మింగవచ్చు. దీని ఘాటు ఎక్కువ అనిపిస్తే, ఆకుల/రెబ్బల పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.