Electric Scooters: దేశంలో తొలిసారిగా ఈ-స్కూటర్ల రీకాల్‌.. వాహనాలను వెనక్కి రప్పించనున్న కంపెనీ

|

Apr 17, 2022 | 1:48 PM

Electric Scooters: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ (Electric Scooters)అందుబాటులోకి వస్తున్నాయి..

1 / 5
Electric Scooters: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ (Electric Scooters)అందుబాటులోకి వస్తున్నాయి. ఇక కొన్ని కంపెనీలకు చెందిన స్కూటర్లలో పలు సమస్యలు ఉండటంతో  రీ-కాల్‌ చేస్తున్నాయి.

2 / 5
తాజాగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్‌.. ప్రెయిజ్‌ ప్రో మోడల్‌కు చెందిన 3,215 యూనిట్ల వాహనాలను తక్షణమే రీకాల్‌ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

3 / 5
వాటి బ్యాటరీల్లో ఏదైనా సమస్యలున్నాయా అని పరీక్షించి, పరిష్కరించేందుకే వెనక్కి రప్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కంపెనీ తన వాహనాలను రీకాల్‌ చేయడం ఇదే తొలిసారి.

4 / 5
ఈ మధ్యకాలంలో పలు చోట్ల విద్యుత్‌ ద్విచక్ర వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకినావా తన వాహనాలను వెనక్కి రప్పించింది.

5 / 5
పుణెలో ఓలా ఈ-స్కూటర్‌  కాలిపోయిన ఉదంతంపై గతనెలలో కేంద్ర సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. వాహనాలను వెనక్కి రప్పించేందుకు డీలర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని.. కస్టమర్ల వెసులుబాటుకు అనుగుణంగా వాహనాన్ని వెనక్కి రప్పించి బ్యాటరీలో లోపాలేమైనా ఉన్నాయని పరీక్షించి, ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వనున్నట్లు ఒకినావా వెల్లడించింది.