
కావలసిన పదార్థాలు: 3 కప్పుల మరమరాలు, అర కప్పు పంచదార, అర కప్పు మిల్క్ పౌడర్, 5 నుండి 6 జీడిపప్పు పలుకులు, 2 యాలకులు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, కేవలం 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు, 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, గార్నిషింగ్ కోసం – బాదం లేదా పిస్తా పలుకులు

తయారీ విధానం: ఒక చిన్న మిక్సీ జార్‌లో అర కప్పు చక్కెర, 2 యాలకులు వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేయాలి. ఒక మిక్సింగ్ బౌల్‌పై జల్లెడ ఉంచి.. ఈ పంచదార పొడిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి 3 కప్పుల మరమరాలు, 5-6 జీడిపప్పు పలుకులు వేయాలి. ఎక్కడా పలుకులు లేకుండా చాలా మెత్తటి పౌడర్‌లా మిక్సీ పట్టాలి. ఈ మరమరాల పొడిని కూడా పంచదార ఉన్న బౌల్‌లోని జల్లెడలోకి వేసి ఉండలు లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి.

జల్లించిన మిశ్రమంలో అర కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసి జల్లించి.. పొడులన్నీ ఒకదానికొకటి బాగా కలిసేలా చేత్తో కలపాలి. ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండికి పట్టేలా కలపాలి. ఇప్పుడు కేవలం 1 నుండి 2 టేబుల్ స్పూన్ల పాలను మాత్రమే కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఎక్కువ పాలు వేయకూడదు.

కలిపిన ముద్దను రెండు భాగాలుగా విభజించాలి. ఒక భాగంలో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ నచ్చితే సన్నని బాదం, జీడిపప్పు తరుగు వేసి కలిపి.. చిన్న చిన్న గోళీ సైజు బాల్స్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.మిగిలిన తెల్లటి పిండి నుంచి కొద్దిగా పెద్ద సైజు బాల్ తీసుకుని అరచేతిలో చిన్న పూరీలా ఫ్లాట్‌గా ఒత్తుకోవాలి.

మధ్యలో పసుపు రంగు చిన్న బాల్‌ను ఉంచి.. అంచుల వెంట లోపలికి మడిచి ఫోల్డ్ చేసి మళ్లీ గుండ్రంగా తిప్పి తేలికగా అదిమి పేడా ఆకారంలో చేసుకోవాలి. అన్ని పేడాలను ఇలాగే చేసుకుని పైనుంచి బాదం లేదా పిస్తా పలుకులు అదిమి గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ 'మరమరాల స్టఫ్డ్ పేడా' సిద్ధం! స్టవ్ వెలిగించే పనిలేకుండా పదే నిమిషాల్లో తయారయ్యే ఈ స్వీట్ నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ, మిల్క్ పౌడర్ కమ్మదనంతో పిల్లలను, పెద్దలను ఎంతగానో అలరిస్తుంది!