
నిర్మలా సీతారామన్ తొలిసారి 2019 లో ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె ఏపీకి చెందిన మంగళగిరి చేనేత పట్టు చీరను ఎంచుకున్నారు. ఇది గులాబీ రంగులో ఉండి , అంచు బంగారు రంగులో ఉంటుంది. ఆ బడ్జెట్ సమయంలో ఇది చాలా ఆకర్షణగా నిలిచింది.

2020లో బడ్జెట్ ప్రవేశ పట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించింది.

2021లో మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను ధరించింది. ఇది ఎరుపు రంగులో గ్రీన్, వైట్ కలర్ బోర్డర్‌తో ఉంటుంది.

2022లో ఒడిశా రాష్ట్రానికి చెందిన బొంకాయ్ శైలి చీరను ధరించారు. ఇది బ్రౌన్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

2023లో 2023లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ,చాలా ఆకర్షణీయమైన కర్ణాటకకు సంబంధించిన కసూతి ఎంబ్రాయిడరీ చీరను ధరించింది. ఎరుపు రంగులో ఉంటూ, నలుపు రంగు బోర్డర్‌తో ఉంది. చేతితో అల్లిన కసూతి వర్క్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

2024లో మధ్యంతర బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీతో ఉన్న ఇండిగో బ్లూకలర్ సిల్క్ చీరను ధరించింది. ఇది ఆ బడ్జెట్ సమయంలో చాలా ఆకర్షణీయంగా నిలిచింది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తెలుపు రంగు గోల్డ్, గులాబీ రంగు బోర్డర్ ఉన్న చీరను ధరించింది.

2025లో బడ్జెట్ సమయంలో బిహార్‌కు చెందిన మధుబని పెయింటింగ్ చీరను ధరించింది. క్రీమ్ కలర్‌లో ఉన్న ఈ సిల్క్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

2026 యూనియన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సారీ ధరించారు. ఈ సారి తమిళనాడు కాంచీపురం పట్టు చీరను ధరించారు. ఊదా రంగులో ఉన్న ఈ చీరపైన బ్రౌన్ బార్డర్, లేత గోధుమ రంగు గీతలతో చాలా ఆకర్షణీయంగా ఉంది.