
మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్న ఇండోర్-ఇచాపూర్ జాతీయ రహదారి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాంతీయ అధికారి శ్రావణ్ కుమార్ సింగ్ తెలిపారు.

సోమవారం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రతస్తుం ఈ హైవేపై అడ్డంగా ఉన్న పర్వతాల గుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు మూడు సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సొరంగాలు పూర్తయిన వెంటనే హైవే అందుబాటులో వస్తుందన్నారు.

ఈ సొరంగాలు నిర్మాణం ఇరుకైన, ఏటవాలుగా ఉండే ప్రమాదకరమైన ఘాట్ రోడ్ల నుండి వాహనదారులకు విముక్తి కలిగిస్తాయని, అలాగే హైవేపై సురక్షితమైన, సజావుగా ట్రాఫిక్‌ను నిర్ధారిస్తాయని తెలిపారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.

ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్న పని ఖర్గోన్ జిల్లాలోని తేజాజీ నగర్ (ఇండోర్), బల్వాడా మధ్య ఉన్న 33.40 కిలోమీటర్ల మేర నిర్మాణమే అన్నారు. ఈ కొండ ప్రాంతాల్లో అత్యాధునిక 'ఎలక్ట్రానిక్ బ్లాస్టింగ్ టెక్నాలజీ'ని ఉపయోగించి 575 మీటర్ల పొడవైన భేరుఘాట్ సొరంగం, 550 మీటర్ల పొడవైన కోరల్ ఘాట్ సొరంగం, 480 మీటర్ల పొడవైన బైగ్రామ్ సొరంగంతో సహా మూడు సొరంగాలను నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ హైవే పూర్తయితే మధ్యప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. నాలుగు లేన్ల రహదారి ఇండోర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. ఇండోర్, హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందన్నారు.ఈ హైవే పూర్తయితే మధ్యప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. నాలుగు లేన్ల రహదారి ఇండోర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. ఇండోర్, హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందన్నారు.