శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమ్మిచరు నల్లావీధి శ్రీ విజయదుర్గ అమ్మవారు.లక్షలాది రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసారు.
ఆలయం మొత్తం కరెన్సీ 10, 20, 50, 200, 500 నోట్లతో అమ్మవారి ఆలయం మొత్తం అలంకరణ చేసారు.
శరన్నవరాత్రి లో భాగంగా ఆరవ రోజు లక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు.
నల్లావీధి లో అఖండ జ్యోతి దీపాలతో గ్రామోత్సవం నిర్వహించరు మహిళలు. కన్నుల పండుగగా ఆఖండ జ్యోతి దీపాలను తలపై పెట్టుకుని వీధుల్లో ఊరేగింపు అత్యంత ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
కరెన్సీ అమ్మవారిగా దర్శనమివ్వడం తో నల్లావీధి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తరు.
నల్లా వీధి అమ్మవారి ఆలయంతో పాటు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు నిర్వాహకులు.