
ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. సాధ్యమైనప్పుడల్లా ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవాలి. ముల్లంగిలో విటమిన్ సి కూడా ఉంటుంది.

ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని పచ్చిగా తినడం వల్ల మూలవ్యాధి పైల్స్ పూర్తిగా నయమవుతుంది. ముల్లంగి తినడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

ముల్లంగి రుచి కాస్త వెగటుగా ఉండే మాట నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉన్నాయి.

ముల్లంగిలో పలు రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కూర, చారు, పచ్చడి, సలాడ్.. ఇలా ముల్లంగితో ఏదైనా చేసుకోవచ్చు. ముల్లంగితో కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెను కవచంలా కాపాడుతుంది.

ముల్లంగితో వివిధ వంటకాలను తయారు చేసుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఇంత మంచి పోషకాహారం కనుకనే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి.