
ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆ భూమి దేవుడు తిరిగిన ప్రాంతం. దీంతో అనువణువునా పురాతన ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా భారీ సొరంగం ఇప్పటికి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ సొరంగ మార్గమే ఒక మహా అద్భుతం అని అందులో నిధి ఉందని ప్రచారం కూడా సాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థాన అనుబంధ ఆలయం నాంపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. ఈ స్వామివారు స్వయంభు ఎతైన కొండపైన స్వామి వారు దర్శనమిస్తారు.

ఈ ఆలయానికి సుమారుగా 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే రాజ నరేంద్రుడి కాలంలోనే రాజ రాజ నరేంద్రుడు ఈ కొండపైన తపస్సు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండ నుంచి రాజన్న గర్భగుడి వరకు ఏడు కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ఉంది. అయితే 9 మంది సిద్దులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని, తరువాత సొరంగ మార్గం ద్వారా రాజన్న ఆలయ గర్భగుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించేవారు అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఇప్పటికీ ఆ సొరంగ మార్గం చెక్కుచెదరలేదు. భారీ సైజులో సొరంగ మార్గం ఉంది. పెద్దపెద్ద బండరాళ్ల మధ్య నుంచి ఈ సొరంగ మార్గం స్వామి వారి సన్నిధి వరకు ఉంది. అయితే రాజుల పాలనలో ఈ సొరంగ మార్గంలో కూడా జీవించారని ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఈ సొరంగ మార్గంలో ఏదో ఒక మహా అద్భుతం దాగి ఉందని ప్రచారం సాగుతుంది. అయితే గతంలో చాలామంది సొరంగ మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.

కానీ చిమ్మ చీకటి భారీ శబ్దాల కారణంగా భయంతో వెనక్కి వచ్చారు. అదేవిధంగా ఈ సొరంగ మార్గం పైన వివిధ రకాల పరిశోధనలు జరిగాయి కానీ ఎంత లోతు ఉందో తేల్చలేకపోయారు. లోనికి వెళ్లేందుకు సాహసం చేయలేకపోయారు. ఇప్పటికి చాలామంది భక్తులు నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ సొరంగ మార్గాన్ని వీక్షిస్తారు. ఇప్పటికి సుమారుగా 200 మీటర్ల వరకు పైనుంచి సొరంగ మార్గం కనబడుతుంది. అయితే సొరంగ మార్గంలో ఏముంది అనే విషయాన్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియట్లేదు. ఆధ్యాత్మికత సంతరించుకున్న ఈ ప్రాంతంలో ఏదో ఒక మహా అద్భుతం దాగి ఉందని భక్తుల అపార నమ్మకం ఈ క్రమంలో గతంలో గుప్త నిధుల ముఠా కూడా ఈ సొరంగ మార్గం పైన కన్నువేసింది. కానీ భారీ సొరంగం ఉండడంతో లోనికి వెళ్లే అవకాశం లేకపోవడంతో తవ్వలేకపోయారు. మొత్తానికి ఈ సొరంగ మార్గంలో ఏముందో ప్రభుత్వమే అధ్యయనం చేసి భక్తులకు వివరించాలని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ సొరంగ మార్గం ద్వారానే సిద్ధులు రాజన్న ఆలయానికి వెళ్లేవారని పురోహితులు చెబుతున్నారు. ఎక్కడ లేని విధంగా ఈ సొరంగ మార్గం ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నదని అంటున్నారు. చాలామంది లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన భయంతో వెనక్కి తిరిగి వచ్చారని అంటున్నారు. ఈ సొరంగ మార్గం నుంచి అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఈ సొరంగా మార్గం సురక్షితంగా ఉందని తెలుపుతున్నారు. రాజుల కాలంలో ఇందులో ఏదైనా దాచిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.