
ప్రపంచంలో చాలా భయంకరమైన, ప్రమాదకరమైన కొన్ని కుక్కల జాతులు ఉన్నాయి. అవి దాడి చేస్తే వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. మీ ప్రాంతాల్లో కూడా అలాంటి కుక్కలు ఉంటే జాగ్రత్తగా ఉండటం మంచింది. అలాంటి జాతుల కుక్కల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

రాట్ వీలర్ డాగ్ : ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్క జాతులలో ఒకటి. ఈ కుక్క శరీరం ధృడంగా ఉంటుంది. దవడలు చాలా శక్తివంతమైనవి. ఈ జాతి కుక్కలు ఇతర కుక్కలను, అపరిచితులను ద్వేషిస్తాయి. రాట్ వీలర్ ఎవరి నుంచైనా చిన్న ప్రమాదం అని అనిపిస్తే.. వెంటనే దాడి చేస్తాయి. కోపంగా ఉన్నారని భావిస్తే యజమానులను సైతం వదిలిపెట్టవు.

పిట్‌బుల్ : ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలలో పిట్‌బుల్స్ కూడా ఒకటి. పిట్‌బుల్ జాతి కుక్కలు వారి దూకుడు వైఖరితో ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఈ జాతి కుక్కలను నమ్మడం మంచిది కాదు. అయినప్పటికీ.. ఈ కుక్కలు యజమానులతో విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భావిస్తారు.

జర్మన్ షెపర్డ్ : ఈ కుక్క జాతి జర్మనీకి చెందినది. చాలామంది జర్మన్ షెపర్డ్‌ను ఇష్టపడతారు. ఈ జాతి కుక్కలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జర్మన్ షెపర్డ్‌లు ఎంత స్నేహంగా ఉంటాయో అంతే ప్రమాదకరం. చిన్నపాటి ప్రమాదం వినిపించినా ఎవరిపైనైనా దాడి చేస్తాయి. డాబర్ మాన్ కూడా ప్రమాదకరమేనని పేర్కొంటున్నారు.

చౌ-చౌ : చౌ-చౌ కుక్కలు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే ఈ జాతి కుక్కలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలలో ఒకటిగా పరిగణిస్తారు. వాటి సమ్మతి లేకుండా యజమానులు కూడా వాటి దగ్గరికి వెళ్ళలేరు.

ప్రెసా కానరియో : ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్క జాతులలో Presa Canario కూడా ఒకటి. ఆఫ్రికాలో కనిపించే ఈ జాతి కుక్కల బరువు.. మనుషుల బరువుతో సమానంగా ఉంటుంది. ఇది 60 కిలోల వరకు ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి.. దాడి చేస్తే, తప్పించుకోవడం చాలా కష్టం.