వర్షాకాలంలో దట్టమైన అడవుల్లో ప్రయాణించడం ప్రమాదకరం. తేలికపాటి అటవీ ప్రాంతాలలో ప్రయాణం చేయడం బెటర్. అలాగే దోమల నుంచి రక్షణ పొందాలి. లేదంటే మలేరియా, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. కీటకాలను నివారించడానికి పూర్తి చేతులు, ప్యాంటు వంటి బట్టలు ధరించడం మంచిది. వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, కడుపునొప్పి, అజీర్తి వంటి వాటికి సంబంధించిన జనరల్ మందులు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రయాణంలో ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఈ మందులు ఉపయోగపడతాయి.