
వాన పడుతున్నప్పుడు ఈ మొక్కజొన్న గారెలు వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. ఇంకా ఇవి గారెలు మాదిరి కాకుండా వడలుగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ గారెలు బయటకు కరకరలాడుతూ, లోపల మాత్రం మెత్తగా తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇంకా వీటిని మధ్యాహ్నం కూడా తింటే మంచిగా ఉంటుంది.

మొక్కజొన్న గారెలకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల మొక్కజొన్న గింజలు, ఒక కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను తీసుకోవాలి

ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకుని బాగా కడిగి నీటిని వంపేయాలి. ఇంకా ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో కొద్దిగా మొక్కజొన్న గింజలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి వీటిని మెత్తగా కాకుండా కొంచం పలుచగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద బౌల్ లో ఈ మిశ్రమాన్ని తీసుకుని దానిలో బియ్యప్పిండి, శనగపిండిని కూడా కొద్దిగా కలపాలి.

ఇంకా దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇది మరి పలుచుగా కాకుండా బియ్యప్పిండిని కూడా వేసుకోవాలి. ఇంకా వీటిని గారెలు మాదిరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. పాన్ లో పోసి మీడియం మంటపై వేడి చేయాలి.

చేతికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని గారెల్లాగా వేసుకోవాలి . ఇంకా వీటిని చిన్న వడలుగా కూడా మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇక వీటిని ఆయిల్ వేసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బాగా వేయించాలి. ఈ వేయించిన గారెలను టిష్యూ పేపర్‌పై ఉంచితే నూనె పోతోంది.