అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క మిస్సింగ్.. కనిపిస్తే వెంటనే చెప్పండి.. రూ.5 వేల రివార్డ్!

Edited By:

Updated on: Sep 05, 2026 | 4:14 PM

మూగజీవులతో అనుబంధం పెనవేసుకున్న జంతు ప్రేమికులు ఆ మూగజీవులు దూరమైతే ఎలా తల్లడిల్లిపోతారో ఈ సీన్ చూస్తే కనిపిస్తుంది. ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క కనిపించకుండా పోయింది. ఆ రోజు నుండి తల్లడిల్లిపోతున్న ఆ కుటుంబం ఆ కుక్క ఆచూకీ కోసం కనిపించిన ప్రతీచోట గాలిస్తున్నారు.

1 / 5
మూగజీవులతో అనుబంధం పెనవేసుకున్న జంతు ప్రేమికులు ఆ మూగజీవులు దూరమైతే ఎలా తల్లడిల్లిపోతారో ఈ సీన్ చూస్తే కనిపిస్తుంది. ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క కనిపించకుండా పోయింది. ఆ రోజు నుండి తల్లడిల్లిపోతున్న ఆ కుటుంబం ఆ కుక్క ఆచూకీ కోసం కనిపించిన ప్రతీచోట గాలిస్తున్నారు.ఆ కుక్క ఫోటోలు పోస్టర్ల రూపంలో ఆ ప్రాంతమంతా అతికించారు. పట్టించిన వారికి నజరానా ప్రకటించారు.. మా కుక్కను వెతికి పెట్టండని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2 / 5
డాగ్ మిస్సింగ్.. పట్టించిన వారికి రూ. 5000 రూపాయల నగదు బహుమతి.. అంతేకాదు మంచి కానుక కూడా ఇస్తారట. ఇంతకీ ఈ కుక్క పేరేంటి..! వయస్సు ఎంత..! ఏ బ్రీడ్..! గుర్తుపట్టడం ఎలా..! అనే సందేహాలు ఉన్నాయి కదూ..!ఈ పెంపుడు కుక్క పేరూ చోటు, ఊరు హనుమకొండ లోని నక్కలగుట్ట, యజమాని పేరు అని, బ్రీడ్ జర్మన్ షెఫర్డ్, వయస్సు 1 సంవత్సరం, మెడలో బ్లూ కలర్ పట్టి ఉంటుంది..

3 / 5
ఆగస్టు 28వ తేదీన ఈ డాగ్ మిస్ అయింది.. ఇంటిముందు ఓ శుభకార్యం జరుగుతున్న సందర్భంగా బాంబులు కాల్చడంతో ఆ శబ్దం తట్టుకోలేక  ఇంటి గోడ దూకి పారిపోయింది. అప్పటినుండి ఈ పెంపుడు కుక్క కంటికి కనిపించడం లేదు. ఏమైపోయిందో తెలియక ఈ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఆ పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేక కుమిలిపోతున్నారు..

4 / 5

ఆ పెంపుడు కుక్క ఫోటోలతో పోస్టర్స్ ముద్రించి ఆ ప్రాంతమంతా గోడలకు అంటించారు.. ఎవరైనా తమ పెంపుడు కుక్కను పట్టిస్తే వారికి ఐదు వేల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు.. అంతేకాదు ఆ కుక్కని వెతికి పట్టించిన వారికి ఊహించని గిఫ్ట్ కూడా ఇస్తామని తెలిపారు..

5 / 5
ఆ పెంపుడు కుక్కధర ఎంత అనేది కాదు.. ఆ మూగజీవితో ఉన్న అనుబంధమే వారిని తట్టుకోలేక పోయేలా చేస్తుంది.ఆ కుక్క ఫోటోలతో పోస్టర్స్ ముద్రించి ప్రచారం చేయడమే కాదు..వేలాది రూపాయలు వెచ్చించి ఆ కుక్క ఫోటోలతో పత్రికా ప్రకటనలు ఇచ్చారు
కనిపించిన ప్రతిచోట తమ పెంపుడు కుక్కకోసం గాలిస్తున్న ఈ కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమ కుక్కను వెతికి పెట్టమని దేదుకున్నారు. లేదంటే ఎవరైనా ఆ కుక్కను పోలీసులకు అప్పగిస్తే తమకు సమాచారం ఇవ్వండని పోలీసులకు తెలిపారు..

ఆ పెంపుడు కుక్కధర ఎంత అనేది కాదు.. ఆ మూగజీవితో ఉన్న అనుబంధమే వారిని తట్టుకోలేక పోయేలా చేస్తుంది.ఆ కుక్క ఫోటోలతో పోస్టర్స్ ముద్రించి ప్రచారం చేయడమే కాదు..వేలాది రూపాయలు వెచ్చించి ఆ కుక్క ఫోటోలతో పత్రికా ప్రకటనలు ఇచ్చారు కనిపించిన ప్రతిచోట తమ పెంపుడు కుక్కకోసం గాలిస్తున్న ఈ కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమ కుక్కను వెతికి పెట్టమని దేదుకున్నారు. లేదంటే ఎవరైనా ఆ కుక్కను పోలీసులకు అప్పగిస్తే తమకు సమాచారం ఇవ్వండని పోలీసులకు తెలిపారు..

Loading...
Unable to load recommendations.
Follow Us